: భారత్‌-పాక్‌ ఫైనల్‌ మ్యాచ్‌ ఫిక్స్ అయిందేమో!: కేంద్ర మంత్రి సంచలన వ్యాఖ్యలు


గత నెల 18వ తేదీన ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా భారత్, పాకిస్థాన్ మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్ ఫిక్స్ అయిందేమోనన్న అనుమానాన్ని వ్యక్తం చేస్తూ, కేంద్ర సామాజిక న్యాయ శాఖ సహాయ మంత్రి రాందాస్ అథావాలే సంచలన వ్యాఖ్యలు చేశారు. గుజరాత్ లో పర్యటిస్తున్న ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఈ మ్యాచ్ లో భారత్ ఘోర పరాజయం తనను విస్మయానికి గురి చేసిందని, తనతో పాటు ప్రతి అభిమానికీ ఫిక్సింగ్ పై అనుమానాలున్నాయని, దీనిపై సమగ్ర దర్యాఫ్తు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. 'ఒక మ్యాచ్ లో పాకిస్థాన్ ను 180 పరుగుల తేడాతో ఓడించిన జట్టు, ఇంకో మ్యాచ్ లో 124 పరుగుల తేడాతో ఓడిపోవడం ఎంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఇదెలా సాధ్యం? మ్యాచ్ ఫిక్సయిందా? దీనిపై వాస్తవాలు వెలికితీయాలి' అని ఆయన డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News