: జీఎస్టీ ప్రభావంతో మరో మూడు నెలల్లో లక్ష ఉద్యోగాలు: కేంద్రమంత్రి దత్తాత్రేయ


జీఎస్టీ అమ‌లులోకి వ‌చ్చిన నేప‌థ్యంలో మూడు నెలల్లో లక్ష ఉద్యోగాలు వ‌స్తాయ‌ని కేంద్ర కార్మిక శాఖ మంత్రి ద‌త్తాత్రేయ అన్నారు. ఈ ప‌న్ను విధానం వల్ల ఆర్థిక వ్యవస్థ పుంజుకోవ‌డమేకాక కొత్త‌గా ఉద్యోగాలు వ‌స్తాయ‌ని చెప్పారు. ముఖ్యంగా  దేశంలో అకౌంటెన్సీ రంగంలో సుమారు 60వేల కొత్త ఉద్యోగాలు వ‌స్తాయ‌ని తెలిపారు. బోర్డర్‌ చెక్ పోస్టులను రద్దు చేయడంతో వస్తువుల అంతర్ రాష్ట్ర రవాణా ఆలస్యం కాదని ఆయ‌న చెప్పారు. మరోవైపు జీడీపీ 7 నుంచి 9 శాతానికి పెరుగుతుంద‌ని, ద్రవ్యోల్బణం అదుపులోకి వస్తుందని అన్నారు. జీఎస్టీ కొత్త పన్నుల విధానం  అమలు నేపథ్యంలో తమ ప‌భుత్వం వ్యాపారుల కోసం సాధారణ వ‌ర్క్‌షాపుల‌ను కూడా నిర్వ‌హించింద‌ని తెలిపారు. ఇంత‌టి గొప్ప సంస్క‌ర‌ణ అమ‌లు అవుతోంటే మ‌రోవైపు నిన్న రాత్రి పార్లమెంటు సెంట్రల్ హాల్లో నిర్వ‌హించిన ప్ర‌త్యేక కార్య‌క్ర‌మానికి కాంగ్రెస్, వామపక్ష పార్టీలు హాజ‌రుకాలేద‌ని ఆయ‌న విమ‌ర్శించారు.

  • Loading...

More Telugu News