: తోటి విద్యార్థుల ముందే పురుగుల మందు తాగి బాలుడి ఆత్మ‌హ‌త్యాయ‌త్నం


తోటి విద్యార్థుల ముందే పురుగుల మందు తాగి ఓ ఎనిమిదో త‌ర‌గ‌తి బాలుడు ఆత్మ‌హ‌త్యాయ‌త్నం చేసిన ఘ‌ట‌న వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలం సిరిపురం ప్రభుత్వ పాఠశాలలో జ‌రిగింది. ఆ బాలుడు సిరిపురం బీసీ బాలుర వసతి గృహంలో ఉంటూ చదువుకుంటున్నాడు. ఆ బాలుడు మల్లారెడ్డిగూడెం గ్రామానికి చెందిన రాజు, మంగమ్మల కుమారుడు వంశీ వర్ధన్(13) అని ఉపాధ్యాయులు తెలిపారు. హాస్ట‌ల్ నుంచి పాఠ‌శాల‌కు వ‌చ్చే స‌మ‌యంలోనే ఆ విద్యార్థి తన వెంట పురుగుల మందును తీసుకెళ్లి ఈ ఘ‌ట‌న‌కు పాల్ప‌డ్డాడు. ఈ ఘ‌ట‌న‌పై తోటి విద్యార్థులు త‌మ టీచ‌ర్ల‌కు సమాచారం అందించడంతో... ఆ విద్యార్థిని వారు ఆసుప‌త్రికి త‌ర‌లించారు. వంశీ వ‌ర్ధ‌న్ తల్లిదండ్రులకు కూడా ఈ సమాచారం అందించారు. ఆ బాలుడు ఈ ఘ‌ట‌న‌కు ఎందుకు పాల్ప‌డ్డాడ‌న్న‌ స‌మాచారం అందాల్సి ఉంది.         

  • Loading...

More Telugu News