: నీళ్ల కోసం చెలరేగిన గొడవ... తండ్రీకొడుకుల కాల్చివేత


పొలాల్లో నీళ్ల పంపకాలపై రెండు వర్గాల మధ్య చెలరేగిన గొడవ ఇద్దరి ప్రాణాలు పోవడానికి కారణమైంది. ఈ ఘటన హర్యానాలోని సోనిపేట్ జిల్లాలో జరిగింది. ఈ రోజు పొలాల్లో నీళ్ల పంపకాలపై మాట్లాడుకున్న రెండు వర్గాలు ఒక‌రిపై ఒక‌రు విమ‌ర్శ‌లు చేసుకుంటూ రెచ్చిపోయాయి. దీంతో ఓ వ‌ర్గం వ్యక్తులు మోఖంసింగ్(55), ఆయన కుమారుడు దేవేందర్ సింగ్ (26)లను కాల్చి చంపేశారు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు కాల్పుల‌కు పాల్ప‌డ్డ‌ నిందితుడు, అతడితో పాటు ఉన్న మరో ఐదుగురు వ్యక్తులను అరెస్టు చేశారు. ప్రాణాలు కోల్పోయిన‌ దేవేందర్ సింగ్ కు ఇటీవలే ఢిల్లీ పోలీసు విభాగంలో జాబ్ వ‌చ్చింది. 

  • Loading...

More Telugu News