: భర్తను ప్రియుడితో చంపించిన భార్య!
ఓ మహిళ తన భర్తను ప్రియుడితో చంపించిన దారుణ ఘటన హైదరాబాద్ శివారులోని బూర్గులలో చోటు చేసుకుంది. ఆంజనేయులు (35) అనే వ్యక్తి ప్రతిరోజు తాగి వచ్చి తన భార్య లక్ష్మిని హింసించేవాడు. మరోవైపు ఆంజనేయులుకు తమ్ముడు వరసైన హనుమంతుతో లక్ష్మి వివాహేతర సంబంధం పెట్టుకుంది. హనుమంతు ఆర్మీలో ఉద్యోగం చేస్తున్నాడు. లక్ష్మిని ఆయన పదే పదే కలిసేవాడు. ఇటీవల తన ప్రియుడు హనుమంతుతో లక్ష్మి తన భర్త తనను కొడుతున్నాడని, చంపేయమని చెప్పింది. దీంతో హనుమంతు.. ఆంజనేయులును బయటకు తీసుకెళ్లి బూర్గుల శివార్లలో మద్యం తాగించాడు. అక్కడ ఆంజనేయులు గొంతుకు టవల్ బిగించి హనుమంతు చంపేశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఎట్టకేలకు నిందితులను అరెస్టు చేశాడు.