: సీఎం చంద్రబాబు పాల్గొన్న కార్యక్రమంలో పేలిన హీలియం బెలూన్లు.. ఇద్దరు చిన్నారులకు గాయాలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గుంటూరు జిల్లా ఓబులనాయుడు పాలెంలో ఈ రోజు నిర్వహించిన ఓ కార్యక్రమంలో అపశ్రుతి చోటు చేసుకుంది. ఈ కార్యక్రమంలో చంద్రబాబు హీలియం వాయువు నింపిన బెలూన్లను ఎగురవేశారు. అయితే, అవి అనుకోకుండా పేలిపోవడంతో ఆ కార్యక్రమానికి వచ్చిన ఇద్దరు పిల్లలు గాయాలపాలయ్యారు. వారిని ఆసుపత్రికి తరలించిన పోలీసులు చికిత్స అందిస్తున్నారు. కాగా, ఈ రోజు చంద్రబాబు నాయుడు గుంటూరులోని పలు ప్రాంతాల్లో పర్యటించి అక్కడ జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించారు.