: ఇటీవ‌లి కాలంలో నేను చూసిన మోస్ట్ స్టైలిష్‌ ట్రైల‌ర్‌ల‌లో ఇది ఒక‌టి: మ‌హేశ్ బాబు


'ఇటీవ‌లి కాలంలో నేను చూసిన మోస్ట్ స్టైలిష్‌ ట్రైల‌ర్‌ల‌లో ఇది ఒక‌టి' అంటూ సినీ న‌టుడు మ‌హేశ్ బాబు త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో శమంతకమణి సినిమా ట్రైలర్ ను షేర్ చేశాడు. చివ‌ర‌కు థ‌మ్సప్ టు శమంతకమణి, సుధీర్ బాబు అని పేర్కొన్నాడు. ఈ సినిమా శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోంది. ఇందులో టాలీవుడ్ యువ‌ న‌టులు నారా రోహిత్, సుధీర్ బాబు, సందీప్ కిషన్, ఆది సీనియ‌ర్ న‌టుడు రాజేంద్ర ప్రసాద్ న‌టిస్తున్నారు. ఈ సినిమా ట్రైల‌ర్‌కి మంచి స్పంద‌న వ‌స్తోంది. కాగా, మురుగదాస్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న స్పైడర్ సినిమాలో మహేశ్ బాబు పాల్గొంటున్నాడు.  

  • Loading...

More Telugu News