: జగిత్యాల జిల్లాలో కేటీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం


తెలంగాణ మంత్రి కేటీఆర్ దిష్టిబొమ్మను ఈరోజు ఆందోళనకారులు దగ్ధం చేశారు. జగిత్యాల జిల్లాలోని మెట్ పల్లి మూడో వార్డులో ఈ ఘటన చోటు చేసుకుంది. తీవ్రమైన తాగునీరు, విద్యుత్ సమస్యతో స్థానికులు ఇబ్బంది పడుతున్నారని... ఈ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మంత్రి దిష్టిబొమ్మను దహనం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం కొనసాగింది. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ, తమ సమస్యలను మంత్రి దృష్టికి పలుమార్లు తీసుకెళ్లామని... అయినా స్పందన లేదని మండిపడ్డారు. 

  • Loading...

More Telugu News