: నేను వైన్ లాంటోడిని.. కామెంటేటర్ ప్రశ్నకు ధోనీ సమాధానం!


వెస్టిండీస్ తో నిన్న జరిగిన వన్డే మ్యాచ్ లో మాజీ కెప్టెన్ ధోనీ ఇరగదీశాడు. 79 బంతుల్లో 78 పరుగులు చేసి సత్తా చాటాడు. ఇందులో నాలుగు ఫోర్లు, రెండు సిక్సర్లు ఉన్నాయి. అంతేకాదు, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కూడా ధోనీకే దక్కింది. ఈ సందర్భంగా, 'వయసు పైబడుతున్న కొద్దీ బాగా ఆడుతున్నావు... ఇది ఎలా సాధ్యం' అని కామెంటేటర్ ప్రశ్నించాడు. దీనికి సమాధానంగా 'నేను వైన్ లాంటి వాడిని' అంటూ ధోనీ సమాధానమిచ్చాడు. వైన్ ఎంత ఓల్డ్ అయితే అంత కిక్ ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఈ యాంగిల్ లోనే ధోనీ ఆ సమాధానం ఇచ్చాడు.


  • Loading...

More Telugu News