: తాప్సీతో ఎఫైర్ పట్ల బాలీవుడ్ యంగ్ హీరో స్పందన
టాలీవుడ్ లో పలు చిత్రాల్లో నటించిన తాప్సీ ఇప్పుడు బాలీవుడ్ లో బిజీగా ఉంది. 'పింక్', 'నామ్ షబానా' లాంటి చిత్రాలతో బాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరైంది తాప్సి. ఈ క్రమంలో, బాలీవుడ్ యువ హీరో సాకీబ్ సలీంతో తాప్సీ ఎఫైర్ సాగుతోందనే ప్రచారం బీటౌన్ లో కొనసాగుతోంది. వీరిద్దరూ కలసి 'తుమ్ హో లగ్తా హై' మ్యూజికి వీడియోలో నటించారు. ఈ సందర్భంగా ఇద్దరూ బాగా క్లోజ్ అయ్యారు. గత ఏడాది తాప్సీ పుట్టినరోజు సందర్భంగా ఇద్దరూ చాలా అన్యోన్యంగా గడిపారు. ఈ ఫొటోలను సాకీబ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో, వీరిద్దరూ డేటింగ్ చేస్తున్నారని, వ్యవహారం చాలా దూరం వెళ్లిందనే వార్తలు మొదలయ్యాయి. మరోవైపు, ప్రస్తుతం తాను ఓ వ్యక్తితో రిలేషన్ షిప్ లో ఉన్నానంటూ తాప్సీ ప్రకటించింది. దీంతో, వీరిద్దరి మధ్య ఎఫైర్ ఉందనే వార్తలకు రెక్కలొచ్చాయి.
తాజాగా ఈ ఎఫైర్ గురించి సకీబ్ స్పందిస్తూ, ఆమెతో తాను డేటింగ్ చేయడం లేదని తెలిపాడు. తాప్సీ తనకు ఫ్రెండ్ మాత్రమేనని... అంతకు మించి తమ మధ్య ఎలాంటి రిలేషన్ షిప్ లేదని చెప్పాడు. ఇద్దరం ఢిల్లీకి చెందిన వాళ్లమే కావడంతో... తమ బంధం బలపడిందని తెలిపాడు. తాప్సీతో సమయాన్ని గడపడం చాలా సంతోషంగా ఉంటుందని అన్నాడు. ఇద్దరి మధ్య కొన్ని అభిరుచులు కామన్ గా ఉన్నాయని... తాప్సీకి కూడా పార్టీలను ఎంజాయ్ చేయడం చాలా ఇష్టమని చెప్పాడు.