: రామోజీరావు ఏనాడూ అవార్డులు కోరుకోలేదు: చంద్రబాబు


రామోజీ గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు తన జన్మస్థలమైన కృష్ణా జిల్లాలోని పెదపారుపూడిని 2015 మే నెలలో దత్తత తీసుకున్నారు. ఆ గ్రామంలో రామోజీ ఫౌండేషన్ తరపున ఇప్పటికే పలు అభివృద్ధి పనులను చేపట్టారు. ఈ రోజు ఆ గ్రామంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటించారు. రామోజీ ఫౌండేషన్ చేపట్టిన పలు అభివృద్ధి పనులను ఆయన పరిశీలించారు. అనంతరం డిజిటల్ క్లాస్ రూమ్, సురక్షిత త్రాగునీటి పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా రామోజీరావు కుమారుడు కిరణ్, మంత్రి కామినేని శ్రీనివాసరావులు కూడా ఆయనతో పాటు ఉన్నారు.

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, తెలుగు జాతి గర్వించదగ్గ వ్యక్తి రామోజీరావు అని చెప్పారు. పెదపారుపూడి గ్రామంలో పుట్టి, అంచెలంచెలుగా ఎదిగిన వ్యక్తి రామోజీరావు అని అన్నారు. సమాజంలో రామోజీ ఒక చరిత్ర సృష్టించారని కితాబిచ్చారు. ఆయన ఎన్నడూ అవార్డులను కోరుకోలేదని... అయినప్పటికీ, ఆయన పేరును పద్మవిభూషన్ కు టీడీపీ ప్రభుత్వం సిఫార్సు చేసిందని తెలిపారు. తమ సిఫార్సును ఆమోదించి రామోజీరావును కేంద్రప్రభుత్వం పద్మవిభూషన్ పురస్కారంతో సత్కరించిందని చెప్పారు.

  • Loading...

More Telugu News