: కట్టప్ప క్యారెక్టర్ ను నేనైతే ఇంకా బాగా చేసేవాడిని: గుల్షన్ గ్రోవర్
'బాహుబలి-2' సినిమా నుంచి బాలీవుడ్ ప్రముఖులు ఇంకా బయటపడనట్టున్నారు. ప్రముఖ బాలీవుడ్ నటుడు గుల్షన్ గ్రోవర్ ఇటీవలే ఈ సినిమాను చూశారట. సినిమా చాలా అద్భుతంగా ఉందని, క్రెడిట్ అంతా దర్శకుడు రాజమౌళిదే అని ఆయన కితాబిచ్చారు. రాజమౌళి గొప్ప దర్శకుడని... అవకాశం వస్తే అతనితో నటించేందుకు తానెప్పుడూ రెడీనే అని చెప్పారు. కట్టప్ప పాత్రలో సత్యరాజ్ చాలా బాగా నటించారని... తానైతే ఆ పాత్రను మరింత బాగా చేసేవాడినని అన్నారు. కట్టప్ప పాత్రకు కావాల్సిన ఫిజిక్, మేనరిజమ్స్ అన్నీ తనకు ఉన్నాయని చెప్పారు.