: తెలంగాణలో సినిమా టికెట్ల ధరల పెంపు లేదు!
జీఎస్టీ ప్రభావంతో తెలంగాణలోని థియేటర్లలో సినిమా టిక్కెట్ల ధరలను పెంచుతున్నట్లు ఇటీవలే తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించి ఇప్పటికే ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయి. అయితే, సర్కారు తాను తీసుకున్న నిర్ణయంపై కాస్త వెనక్కితగ్గింది. ఇండస్ట్రీ నుంచి ఒత్తిడి రావడం, ఇతర పలు అంశాల నేపథ్యంలో ఇటీవల జారీ చేసిన ఆ ఉత్తర్వులను నిలుపుదల చేయాలని సర్కారు నిర్ణయం తీసుకుంది. జీహెచ్ఎంసీ పరిధిలోని థియేటర్లలో కాస్త అధికంగా రేట్లను పెంచడం, మిగతా ప్రాంతాల పరిధిల్లోనూ వేరు వేరు రేట్లు ఉండడం కూడా ఇందుకు కారణమని సమాచారం. తాజా ఉత్తర్వులను సీఎం కేసీఆర్ పరిశీలనకు పంపనున్నారు.