: నయనతారతో పెళ్లిపై స్పందించిన డైరెక్టర్ విఘ్నేష్!


దక్షిణాది సినీ పరిశ్రమలో హీరోయిన్ నయనతారకు ఉన్న పాప్యులారిటీ అంతాఇంతా కాదు. ఆమెకు స్టార్ స్టేటస్ ఏ రేంజ్ లో ఉందో... అంతే స్థాయిలో వివాదాలు కూడా ఉన్నాయి. శింబు, ప్రభుదేవాలతో సుదీర్ఘకాలం ప్రేమాయణం నడిపిన నయన్ ఇప్పుడు డైరెక్టర్ విఘ్నేష్ తో ప్రేమలో ఉంది. గత మూడేళ్లుగా వీరిద్దరి మధ్య అఫైర్ నడుస్తోంది. అంతేకాదు, కొన్ని రోజుల క్రితం వీరిద్దరూ సీక్రెట్ గా పెళ్లి కూడా చేసుకున్నారని కోలీవుడ్ లో పెద్ద టాక్ ఉంది. కొచ్చిలోని ఓ చర్చిలో కేవలం కుటుంబసభ్యులు, కొందరు సన్నిహితుల మధ్య వీరి వివాహం జరిగిందని వార్తలు వెల్లువెత్తాయి.

ఈ నేపథ్యంలో నయన్ తో పెళ్లి ఎప్పుడంటూ ఓ ప్రెస్ మీట్ లో విఘ్నేష్ కు ఓ ప్రశ్న ఎదురైంది. దీనికి సమాధానంగా ఇప్పట్లో పెళ్ళి ఆలోచన లేదని.. ప్రస్తుతం తన దృష్టి అంతా కెరియర్ పైనే ఉందంటూ సమాధానాన్ని దాటేశాడు. మరోవైపు, వీరిద్దరి మధ్య పెళ్లి జరగకపోయినా... ఇద్దరూ సహజీవనం చేస్తున్నారనే టాక్ కూడా ఉంది.

  • Loading...

More Telugu News