: ఆ పాట పాడడం కోసం అఖిల్ ఎంతో సాధన చేశాడు!: నాగార్జున


టాలీవుడ్ అగ్రనటుడు నాగార్జున పుత్రోత్సాహంతో ఉప్పొంగిపోతున్నారు. అఖిల్ అక్కినేని సైమా అవార్డ్స్ వేదికపై ప్రదర్శన ఇచ్చాడు. దీనిపై నాగార్జున ట్విట్టర్ వేదికగా తన ఆనందాన్ని పంచుకున్నారు. అలాగే తాను ఆ షోను ప్రత్యక్షంగా చూడడం మిస్సయ్యానని అన్నారు. ట్విట్టర్ లో నాగార్జున  'సైమా 2017 వేదికపై అఖిల్ పాడుతుండగా నేను లైవ్ చూసి వుండాల్సింది. ఈ ప్రదర్శన కోసం అఖిల్ ఎంతో సాధన చేశాడు.. ఏమైనా కంగ్రాట్స్ రా అబ్బాయీ!' అంటూ కుమారుడుకి శుభాకాంక్షలు చెప్పారు. కాగా, దుబాయ్ లోని అబుదాబి వేదికగా సౌత్ ఇండియా మూవీ అవార్డ్స్ పేరుతో ప్రతిఏటా అవార్డులు ఇస్తున్న సంగతి తెలిసిందే. 

  • Loading...

More Telugu News