: సబర్మతి ఆశ్రమంలో కేటీఆర్.. ఫొటోలు మీరూ చూడండి


గుజరాత్ లోని సబర్మతిలో ఉన్న మహాత్మాగాంధీ ఆశ్రమాన్ని తెలంగాణ మంత్రి కేటీఆర్ నిన్న సందర్శించారు. ఈ సందర్భంగా మహాత్మాగాంధీ నూలు వడికిన చరఖా పక్కన ఆయన కాసేపు కూర్చున్నారు. అక్కడున్న మహాత్ముడి చిత్రపటాలను ఆసక్తికరంగా వీక్షించారు. కేటీఆర్ ఆశ్రమ సందర్శన సందర్భంగా ఆయనకు అక్కడున్న చిన్నారులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మహాత్ముడి సింప్లిసిటీని ఆయన నెమరువేసుకున్నారు. 'ఎంతటి సామాన్యుడు, ఎంతటి అత్యున్నతమైన జీవితం' అంటూ ఈ సందర్భంగా ఆయన ట్వీట్ చేశారు.


  • Loading...

More Telugu News