: ఎవరు ప్యాకేజీ ఇస్తే వారి వద్దకు రోజా వెళ్తుంది: ఎమ్మెల్యే వర్మ
వైసీపీ ఎమ్మెల్యే రోజాపై పిఠాపురం టీడీపీ ఎమ్మెల్యే వర్మ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రోజాకు ఒక నీతి అంటూ ఏమీ లేదని ఆయన విమర్శించారు. ఏ పార్టీ ప్యాకేజీ ఇస్తే అక్కడకు రోజా వెళుతుందని అన్నారు. జగన్ నుంచి కూడా రోజా రూ. 10 కోట్ల ప్యాకేజీ తీసుకుందని ఆరోపించారు. ప్యాకేజీలు తీసుకునే రోజాకు ముఖ్యమంత్రి చంద్రబాబును విమర్శించే నైతిక హక్కు కూడా లేదని అన్నారు. ఐరన్ లెగ్ రోజా పుణ్యమా అని రానున్న ఎన్నికల్లో జగన్ కు ప్రతిపక్ష హోదా కూడా దక్కదని జోస్యం చెప్పారు. టీడీపీ తలుపును కూడా రోజా తట్టిందని... అయితే, రోజాలాంటి క్యారెక్టర్ లేని వ్యక్తులు తమకు అక్కర్లేదని అన్నారు. రోజాలాంటి ఐరన్ లెగ్ తమకు అవసరం లేదని చెప్పారు.