: సైనికులపై అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో... ఆజంఖాన్ పై దేశద్రోహం కేసు నమోదు
సమాజ్ వాదీ పార్టీ సీనియర్ నేత ఆజంఖాన్ పై దేశద్రోహం కేసు నమోదైంది. సైనికులను కించపరిచేలా వ్యాఖ్యానించిన నేపథ్యంలో ఆయనపై ఈ కేసును నమోదు చేశారు. బిజ్ నూర్ లోని చాంద్ పూర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఐపీసీ 124 ఏ (దేశద్రోహం), 131 (సైనికులపై తిరుగుబాటు), 505 (తప్పుదారి పట్టించే వ్యాఖ్యలు చేయడం) సెక్షన్ల కిందు కేసు నమోదు చేశారు. విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్ నేత అనిల్ పాండే ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదైంది. అసోం, కశ్మీర్, జార్ఖండ్ రాష్ట్రాల్లో మహిళలపై సైనికుల వేధింపులు ఎక్కువయ్యాయని... మహిళలపై అత్యాచారాలకు యత్నించే సైనికుల మర్మాంగాలను కోసి వేయాలని ఆజంఖాన్ తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆయనపై దేశద్రోహం కేసు నమోదైంది.