: నెల్లూరు దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేసిన బాలకృష్ణ


ప్రముఖ సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఈ ఉదయం నెల్లూరులోని బారాషాహిద్ దర్గాను సందర్శించుకున్నారు. దర్గాలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనతో పాటు మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరి నారాయణ, నెల్లూరు అర్బన్ డెవలప్ మెంట్ (నుడా) ఛైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి తదితరులు ప్రార్థనల్లో పాల్గొన్నారు. నుడా ఛైర్మన్ గా కోటంరెడ్డి నిన్న ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి బాలయ్య అతిథిగా విచ్చేసిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News