: క్లియరెన్స్ సేల్ నేపథ్యంలో... వైజాగ్ బిగ్ బజార్ వద్ద ఉద్రిక్తత!
విశాఖపట్టణంలోని బిగ్ బజార్ దగ్గర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. వైజాగ్ లోని ద్వారకా నగర్ లో బిగ్ బజార్ షాపింగ్ మాల్ పై వినియోగదారులు విరుచుకుపడ్డారు. జీఎస్టీ అమలు సందర్భంగా క్లియరెన్స్ సేల్ అంటూ బిగ్ బజార్ ప్రచారం చేసింది. దీంతో వైజాగ్ నలుమూలల నుంచి వినియోగదారులు షాపింగ్ మాల్ దగ్గర బారులు తీరారు. ఊహించని స్పందన రావడంతో బారులుతీరిన జనాన్ని బిగ్ బజార్ సిబ్బంది అదుపు చేసే ప్రయత్నం చేశారు. అయితే వారి వల్ల కాకపోవడంతో ముందు జాగ్రత్తగా షాపింగ్ మాల్ ను మూసేశారు. దీంతో ఆగ్రహానికి గురైన వినియోగదారులు బిగ్ బజార్ పై దాడికి దిగారు. బిగ్ బజార్ ప్రమోషన్ కోసం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, బయట ఉంచిన ఫర్నిచర్ ను ధ్వంసం చేశారు. సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.