: జీఎస్టీ ప్రభావం.. సినిమా టికెట్ ధరలు, బెట్టింగ్, పేకాటపై పన్నులు ఈ విధంగా ఉండబోతున్నాయి!


అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చిన జీఎస్టీతో దేశవ్యాప్తంగా పలు మార్పులు చోటు చేసుకున్నాయి. నిన్నటి వరకు తెలుగు సినిమా అయితే 15శాతం, ఇతర సినిమాలు అయితే 20 శాతం వినోదపు పన్నును వసూలు చేసేవారు. ఇకపై ఏ సినిమా అయినా సరే 28 శాతం జీఎస్టీ వసూలు చేస్తారు. ఇందులో రూ. 100లోపు టికెట్ అయితే 18 శాతం జీఎస్టీ వసూలు చేస్తారు. దీంతో, రూ. 100 టికెట్ రూ. 118కి పెరగనుంది. రూ. 150 టికెట్ అయితే రూ. 192కు పెరుగుతుంది. ఈ మొత్తాన్ని రౌండ్ ఫిగర్ చేసే అవకాశాలు కూడా లేకపోలేదు. ఇక రేస్ కోర్సులు, పేకాట, బెట్టింగ్ లపై 28 శాతం పన్ను వసూలు చేయనున్నారు.

  • Loading...

More Telugu News