: చిరంజీవి పార్టీ విఫలమైన విషయాన్ని రజనీకాంత్ కు వివరించిన అమితాబ్!
సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ ప్రవేశంపై ప్రతిరోజూ రకరకాల వార్తలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. ఇంతవరకు ఆయన అధికారికంగా ఎలాంటి స్పష్టతను ఇవ్వకపోవడంతో ఎవరికి తోచిన వార్తలను వారు ప్రచారం చేస్తున్నారు. రాజకీయ రంగంలో ఉండే తీవ్రమైన ఒత్తిడి ఆయన ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుందని రజనీ కుటుంబీకులు ఆందోళన చెందుతున్న విషయం కూడా తెలిసిందే. ఈ నేపథ్యంలో, మరో ఆసక్తికర ఘటన వెలుగులోకి వచ్చింది.
ముంబైలో తన తాజా చిత్రం షూటింగ్ లో ఉన్నప్పుడు బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ ను రజనీ కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఇరువురూ రాజకీయాల గురించి మాట్లాడుకున్నారు. రాజకీయాల్లో తనకు ఎదురైన అనుభవాలను ఈ సందర్భంగా రజనీకి అమితాబ్ వివరించారు. అంతేకాదు, ప్రజారాజ్యం పార్టీని స్థాపించిన చిరంజీవి... రాజకీయాల్లో ఎలా విఫలమయ్యారనే విషయాన్ని కూడా గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో, రాజకీయాల్లో తనకు ఎదురయ్యే సమస్యలు, వాటి ఫలితాలు ఎలా ఉంటాయో బేరీజు వేసుకుంటున్నారట రజనీకాంత్.