: ముంబై పేలుళ్ల దోషులు తాహిర్ మర్చంట్, కరీముల్లాలకు మరణదండన విధించాల్సిందే.. డిమాండ్ చేస్తున్న సీబీఐ!


1993 ముంబై పేలుళ్ల దోషులు తాహిర్ మర్చంట్, కరీముల్లా ఖాన్‌లకు మరణశిక్ష విధించాల్సిందేనని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) శుక్రవారం డిమాండ్ చేసింది. పేలుళ్లకు అసలు కుట్రదారుడు తాహిరేనని సీబీఐ తరపు న్యాయవాది దీపక్ సాల్వే పేర్కొన్నారు. కుట్రదారుల్లో ప్రధాన కుట్రదారుడు అయిన కరీముల్లా ఖాన్‌కు ఆర్డీఎక్స్, ఆయుధాల వినియోగం గురించి పూర్తిగా తెలుసని, అతడికి కూడా మరణశిక్ష విధించాలని కోరారు. అలాగే మరో దోషి అయిన రియాజ్ సిద్ధిఖీకి జీవిత కాల శిక్ష విధించాల్సిందిగా న్యాయస్థానాన్ని కోరారు.

ఈ కేసులో దోషిగా తేలిన ముస్తాఫా దోసా అనారోగ్యంతో ఆస్పత్రిలో మరణించడంతో శిక్షలకు సంబంధించిన తీర్పు వాయిదా పడింది. కాగా, ముంబై పేలుళ్ల కేసును విచారిస్తున్న టాడా కోర్టు జూన్ 16న అబు సలేం, ముస్తాఫా దోసా, ఫిరోజ్ అబ్దుల్ రషీద్ ఖాన్, తాహిర్ మర్చంట్, కరీముల్లా ఖాన్, రియజ్ సిద్ధిఖీలను దోషులుగా ప్రకటించింది. మరో నిందితుడు అబ్దుల్ ఖయ్యూం షేక్‌ను నిందితుడిగా ప్రకటించింది. మార్చి 12, 1993న జరిగిన బాంబు పేలుళ్లలో 257 మంది మృతి చెందగా 713 మంది గాయపడ్డారు.

  • Loading...

More Telugu News