: కర్ణాటక ముఖ్యమంత్రి పేరుతో నకిలీ ట్విట్టర్ ఖాతా... ఒకరి అరెస్టు
సోషల్ మీడియా తీవ్ర స్థాయిలో దుర్వినియోగమవుతోంది. సోషల్ మీడియాలో నకిలీలు భారీ ఎత్తున పుట్టుకొస్తున్నాయి. వాటి ద్వారా వ్యతిరేక వ్యాఖ్యలు, మార్ఫింగ్ లు, మోసాలు... ఇలా ఎన్నో జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య పేరుతో నకిలీ ట్విట్టర్ ఖాతాను ఒక వ్యక్తి తెరిచాడు. ముఖ్యమంత్రి స్వయంగా చేస్తున్నట్టు పలు అంశాలపై ట్వీట్లు చేస్తూ పలువురిని ఆకట్టుకుంటున్నాడు. అయితే ఇది పోలీసుల దృష్టికి రావడంతో దర్యాప్తు చేసిన పోలీసులు, నకిలీ ఖాతాగా నిర్ధారించి, అతనిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం సీఎం పేరుతో ఖాతా ఎందుకు నిర్వహించాల్సి వచ్చిందో విచారిస్తున్నారు. సోషల్ మీడియా ఖాతాలపై అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.