: నుడా చైర్మన్ గా కాటంరెడ్డి ప్రమాణ స్వీకారం.. భారీ ర్యాలీలో పాల్గొన్న బాలకృష్ణ
నెల్లూరు అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ (నుడా) చైర్మన్ గా కాటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా నెల్లూరులో నిర్వహించిన భారీ ర్యాలీలో హిందూపురం ఎమ్మెల్యే, ప్రముఖ సినీ నటుడు నందమూరి బాలకృష్ణ, టీడీపీ కార్యకర్తలు, బాలయ్య అభిమానులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాలకృష్ణకు ఘన స్వాగతం పలికారు. స్థానిక వీఆర్సీ నుంచి ఆర్ఆర్ స్ట్రీట్ లోని ఎన్టీరామారావు విగ్రహం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. కాగా, నుడా పాలక మండలి సభ్యులు కూడా ఈ సందర్భంగా ప్రమాణ స్వీకారం చేశారు.