: మూడో వన్డే.. స్వల్ప స్కోరుకే రెండు వికెట్లు కోల్పోయిన టీమిండియా!
సర్ వివియన్ రిచర్డ్స్ వేదికగా భారత్-వెస్టిండీస్ మధ్య జరుగుతున్న మూడో వన్డేలో టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. భారతజట్టు స్కోరు 11 పరుగుల వద్ద ఉన్నప్పుడే మూడో ఓవర్ నాలుగో బంతికి శిఖర్ ధావన్ (2) అవుటయ్యాడు. కమిన్స్ వేసిన బంతిని ధావన్ కొట్టగా, దానిని రోస్టన్ చేజ్ ఒడిసి పట్టేశాడు. హోల్డర్ బౌలింగులో విరాట్ కోహ్లీ (11) హోప్ కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ ముఖం పట్టాడు. ప్రస్తుతం స్కోరు 11.2 ఓవర్లకు 38/2. క్రీజ్ లో రహానే, యువరాజ్ సింగ్ ఉన్నారు.