: ప్రధాని మోదీని శాలువాతో సత్కరించిన చంద్రబాబు
ప్రధాని నరేంద్ర మోదీని ఏపీ సీఎం చంద్రబాబు శాలువాతో సత్కరించారు. గుజరాత్ లోని గాంధీనగర్ లో జరిగిన భారత టెక్స్ టైల్ ఇండియా-2017 ఎగ్జిబిషన్ ను మోదీ ఈ రోజు ప్రారంభించారు. ఈ సదస్సుకు చంద్రబాబు కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా మోదీకి శాలువా కప్పి సత్కరించిన చంద్రబాబు, ఆయనకు ఓ జ్ఞాపికని అందజేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, భారత టెక్స్ టైల్ రంగానికి మోదీ అంబాసిడర్ అని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో చంద్రబాబుతో పాటు మంత్రి అచ్చెన్నాయుడు, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.