: భూమా, శిల్పా వర్గాల కౌన్సిలర్ల వాగ్వాదం!
నంద్యాల మున్సిపల్ కౌన్సిల్ సమావేశం రసాభాసగా మారింది. భూమా, శిల్పా వర్గాల కౌన్సిలర్ల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. దీంతో, సమావేశం నుంచి అర్థాంతరంగా చైర్ పర్సన్ సులోచన వెళ్లిపోయారు. అభివృద్ధి పనులను ఎజెండాలో చేర్చలేదని టీడీపీ కౌన్సిలర్లు అనడంతో రెండు వర్గాలు పరస్పరం వాదులాడుకోవడంతో సమావేశం నిలిచిపోయింది.