: చిన్నమొత్తాల పొదుపు డిపాజిట్లపై వడ్డీ రేట్లు తగ్గించిన కేంద్ర ప్రభుత్వం


చిన్న మొత్తాల పొదుపు డిపాజిట్లపై వడ్డీ రేట్లను తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. తాజా నిర్ణయం ప్రకారం, ప్రస్తుతం ఉన్న వడ్డీ రేట్లు 0.1 శాతం తగ్గుతాయి. పీపీఎఫ్, ఎన్ఎస్ సీ, కిసాన్ వికాసపత్ర వడ్డీ రేట్లలో కోత విధించగా, సుకన్య సమృద్ధి యోజన సహా వివిధ చిన్నమొత్తాల పొదుపు పథకాలపై 10 బేసిస్ పాయింట్లు తగ్గించినట్టు ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో పీపీఎఫ్, ఎన్ఎస్ సీ పథకాలపై 7.8 శాతం, కిసాన్ వికాస పత్రంపై 7.5 శాతం వడ్డీ, సీనియర్ సిటిజన్ సేవింగ్ పథకం, సుకన్య సమృద్ది పథకాలపై 8.3 శాతం వడ్డీరేటు వర్తిస్తుంది.

  • Loading...

More Telugu News