: కుంబ్లేను ఆపడం కేవలం ఒక్కరికే సాధ్యమయ్యేదట!
టీమిండియా హెడ్ కోచ్ పదవికి కుంబ్లే రాజీనామా చేయడం తెలిసిందే. కుంబ్లే హెడ్ మాస్టర్ తరహాలో వ్యవహరిస్తారనేది ఆటగాళ్ల వాదనైతే... కెప్టెన్ కోహ్లీ పట్ల కుంబ్లేకు కొన్ని అభ్యంతరాలు ఉన్నాయనేది మరో వాదన. అయితే కుంబ్లే గురించి కొన్ని ఆసక్తికరమైన నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. టీమిండియాకు ఆడే రోజుల్లో కూడా కుంబ్లే అందరికంటే కొంచెం విభిన్నంగా ఉండేవాడట. తనకు ఏ విషయంలో అయినా కోపం వస్తే... సచిన్, గంగూలీలు కూడా జంబోకు దూరంగా ఉండేవారట. అలాంటి సమయంలో కుంబ్లేను ఆపడం కేవలం ఒక్కడికి మాత్రమే సాధ్యమయ్యేదట. అతనే 'ది వాల్' రాహుల్ ద్రావిడ్. ఆగ్రహంలో ఉన్న కుంబ్లేను ద్రావిడ్ మాత్రమే చల్లబరిచేవాడట!