: బైక్ రేసర్లను అడ్డుకునేందుకు యత్నించిన కానిస్టేబుల్ కు గాయాలు..అదుపులో నిందితులు


బైక్ రేసింగ్ లకు పాల్పడుతున్న 27 మందిని శంషాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్-బెంగళూరు జాతీయ రహదారిపై శంషాబాద్ సింప్లేక్స్ వద్ద బైక్ రేసింగ్ చేస్తున్న వీరిని పట్టుకునేందుకు కానిస్టేబుల్ నరేందర్ యత్నించారు. అయితే, నరేందర్ ను ఢీకొట్టిన వారు పారిపోయారు. ఆయన్ని సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే, రేసింగ్ కు పాల్పడిన నిందితులందరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులు రాజేంద్రనగర్, వట్టేపల్లి, హసన్ నగర్, సులేమాన్ నగర్ కు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. నిందితులలో ఏడుగురు మైనర్లు ఉన్నారని, దాంతో వారి తల్లిదండ్రులపై కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.

  • Loading...

More Telugu News