: ఫుడ్ ఎలర్జీ ఉన్న పిల్లల్లో ఆందోళన సమస్యలు అధికం!
చిన్నతనం నుంచే ఫుడ్ ఎలర్జీ సమస్య ఉండటం వల్ల పిల్లలు ఎక్కువగా ఆందోళన (యాంగ్జైటీ)కు గురవుతున్నారని ఓ అధ్యయనంలో తేలింది. మామూలు పిల్లలతో పోల్చినపుడు ఫుడ్ ఎలర్జీ ఉన్న పిల్లలు ఒక వయసు వచ్చేసరికి బాగా ఆందోళనకు గురై, అనవసర వ్యాధులను కొనితెచ్చుకుంటున్నారని ఈ అధ్యయనం తేల్చిచెప్పింది. 4 నుంచి 12 ఏళ్ల వయసుగల 80 మంది పిల్లలపై పరిశోధన చేసి ఈ విషయం కనుక్కున్నారు.
ఫుడ్ ఎలర్జీ ఉన్న పిల్లల్లో 57 శాతం ఆందోళన సమస్యలు వున్నట్టు, అయితే, పిల్లల్లో ఫుడ్ ఎలర్జీకి, డిప్రెషన్ కి మాత్రం సంబంధం లేదని పరిశోధకులు గుర్తించారు. భవిష్యత్తులో ఈ సమస్యల వల్ల వారు డిప్రెషన్‌కి గురయ్యే ప్రమాదముండటం వల్ల ఇప్పటినుంచే జాగ్రత్త తీసుకోవాలని మెయిల్‌మన్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ వారు హెచ్చరించారు. ఫుడ్ ఎలర్జీ వల్ల ఆహారం కోసం, ఇంజక్షన్ల కోసం ఎక్కువగా ఖర్చు చేయడం తద్వారా ఆర్థిక పరిస్థితి మీద భారం పడడం వంటి అంశాలన్నీ వారి ఆందోళనకు కారణమవుతాయని మెయిల్‌మన్ స్కూల్ వైద్యుడు డాక్టర్ గుడ్విన్ వివరించారు.