: విదేశాల్లో బీఫ్ తినేవారిని మోదీ ఆలింగనం చేసుకోవచ్చు కానీ, ఇండియాలో బీఫ్ తింటే మాత్రం చంపేస్తారా?: ఆప్ నేత సిసోడియా
ఈ నెల 16న వల్లభ్ గఢ్ ప్రాంతంలో బీఫ్ తరలిస్తున్నారని ఆరోపిస్తూ పదహారేళ్ల యువకుడు జునైద్ ఖాన్ ను చంపి వేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బీజేపీపై ఢిల్లీ ఉపముఖ్యమంత్రి, ఆప్ నేత మనీష్ సిసోడియా విమర్శలు గుప్పించారు. ఢిల్లీ అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ, ప్రజల ఫ్రిడ్జ్ లలో, వారి ప్లేట్లలో బీఫ్ ఉందా? లేదా? అని చూస్తున్న బీజేపీ, వీధుల్లో ప్లాస్టిక్ బ్యాగ్స్ తింటున్న, ప్రమాదాల్లో చనిపోతున్న గోవులను మాత్రం పట్టించుకోదని ఎద్దేవా చేశారు. మోదీ విదేశాలకు వెళ్లి బీఫ్ తినేవారిని ఆలింగనం చేసుకుంటే ఏమీ అనరు కానీ, ఇండియాలో బీఫ్ తినేవారిని మాత్రం చంపేస్తున్నారంటూ బీజేపీపై ఆయన మండిపడ్డారు.