: ఈ దశాబ్దపు అత్యంత ఖరీదైన వివాహాల్లో ఒకటి... మెస్సీ పెళ్లి విందు మెనూ చూస్తే లొట్టలేయాల్సిందే!
ప్రపంచ ప్రఖ్యాత ఫుట్ బాల్ క్రీడాకారుడు లియోనెల్ మెస్సీ నేడు తన చిన్ననాటి స్నేహితురాలు, ప్రేయసి రొకుజోని వివాహం చేసుకోబోతున్నాడు. గత పదేళ్లుగా సహజీవనం చేస్తున్న వీరికి ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు. అర్జెంటీనాలోని రొసారియా నగరంలో ఈ దశాబ్దంలోనే అత్యంత వైభవంగా జరిగే వేడుకల్లో మెస్సి వివాహం కూడా ఒకటని స్థానికులు చెప్పుకోవడం విశేషం. హాలీవుడ్ తో పాటు ప్రపంచ ప్రఖ్యాత ఫుట్ బాల్ ఆటగాళ్లు హాజరయ్యే ఈ వేడుకలో మెనూ గురించి అంతా మాట్లాడుకుంటున్నారు.
మాంసాహార వంటకాలతో నిండిపోయిన ఈ మెనూలో అర్జెంటీనాలోని ప్రముఖ వంటకాలన్నీ చేరిపోయాయి. చికెన్, మటన్, ఫిష్ తదితరాలతో చేసే విభిన్నమైన వంటకాలను అతిథుల కోసం సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. మెనూ అందర్నీ లొట్టలేయిస్తుందని చెబుతున్నారు. అలాగే పెళ్లికి ఎవరైనా బహుమతులు తేవాలనుకుంటే వాటిని లియో మెస్సి ఫౌండేషన్ కు అందజేయాలని వివాహ ఆహ్వానపత్రికలో సూచించారు. ఈ ఫౌండేషన్ చిన్నారుల విద్య, ఆరోగ్యం, క్రీడల కోసం పని చేస్తుంది.