: తిరుమలలో మరోమారు అన్యమత కలకలం


హిందువులు పరమ పవిత్రంగా భావించే తిరుమలలో మరోసారి అన్యమత కలకలం రేగింది. తమిళనాడుకు చెందిన ఓ వాహనంపై ఇతర మతాలకు చెందిన గుర్తులు ప్రముఖంగా కనిపిస్తూ తిరుమలలో చక్కర్లు కొడుతుండగా, విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు. ఇతర మతాల గుర్తుతో నేటి ఉదయం తిరుమలకు ఈ కారు వచ్చిందని విచారణలో తెలుసుకున్నారు. డ్రైవర్ ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా, అన్ని మతాలూ సమానమేనన్న ఉద్దేశంతో మూడు మతాల గుర్తులనూ తన కారుపై ఉంచానే తప్ప, తిరుమలలో నిషేధం ఉందన్న సంగతి తనకు తెలియదని అన్నాడు. కాగా, ఈ వాహనాన్ని వెంటనే తిరుపతికి తరలించామని, డ్రైవర్ ను హెచ్చరించామని పోలీసులు తెలిపారు.

  • Loading...

More Telugu News