: టీమిండియాకు కొత్త కోచ్ ను జూలై 9న ప్రకటిస్తాం: చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్


టీమిండియా చీఫ్ కోచ్ ఎమ్మెస్కే ప్రసాద్ తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు. నిన్న సాయంత్రం తిరుమల చేరుకున్న ఎమ్మెస్కే ప్రసాద్ శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తిరుమలలో టీటీడీ అధికారులు ఆయనకు స్వాగతం పలికారు. సుప్రభాత సేవ అనంతరం తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెస్కే మాట్లాడుతూ, టీమిండియా చీఫ్ కోచ్ ఎవరనేది జూలై 9న ప్రకటిస్తామని చెప్పారు. ఛాంపియన్స్ ట్రోఫీలో అద్భుతంగా రాణించిన టీమిండియా ఫైనల్ లో విఫలమైందని తెలిపారు. ఇప్పుడు టీమిండియా దృష్టంతా 2019 వరల్డ్ కప్ పైనే ఉందని ఎమ్మెస్కే అన్నారు. ఈ లోగా జట్టులో కొత్త ఆటగాళ్లను పరీక్షిస్తామని చెప్పారు. 

  • Loading...

More Telugu News