: 'బాహుబలి' విదేశీ జైత్రయాత్ర ప్రారంభం.. తైవాన్ లో నేడే విడుదల!
సంచలన విజయం సాధించి, రికార్డు స్థాయిలో వసూళ్లను రాబట్టిన చిత్రం 'బాహుబలి-2'. బాలీవుడ్ ప్రముఖులంతా అసూయపడేలా తెలుగు చిత్ర పరిశ్రమ సత్తా చాటుతూ, అఖండ విజయం సాధించింది. రూ. 1600 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టింది. సెప్టెంబర్ లో చైనాలో విడుదల కావడానికి ఈ సినిమా సన్నాహకాలు చేసుకుంటోంది. ఈలోగానే... నేడు తూర్పు ఆసియా దేశమైన తైవాన్ లో విడుదల అయింది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత శోభు యార్లగడ్డ తన సంతోషాన్ని ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు. థాయ్ వాన్ లో 'బాహుబలి-2' తుపాను మొదలవబోతోందంటూ ట్వీట్ చేశారు.