: నేను టీమిండియా కోచ్ పదవికి దరఖాస్తు చేయలేదు: వెంకటేష్ ప్రసాద్ వివరణ


టీమిండియా చీఫ్ కోచ్ పదవికి దరఖాస్తు చేశానంటూ వచ్చిన వార్తలను టీమిండియా మాజీ ఆటగాడు, ప్రస్తుత అండర్ 19 జట్టు చీఫ్ సెలెక్టర్ వెంకటేష్ ప్రసాద్ ఖండించారు. ఈ మేరకు బెంగళూరులో వెంకటేష్ ప్రసాద్ మాట్లాడుతూ, తాను టీమిండియా కోచ్ పదవికి దరఖాస్తు చేయలేదని స్పష్టం చేశాడు. టీమిండియా చీఫ్ కోచ్ గా సెహ్వాగ్ లేదా రవిశాస్త్రి ఎవరు అవుతారో తనకు తెలియదని, వారితో పాటు తాను పని చేయాలనుకుంటున్నానని చెప్పాడు.

తాను బౌలింగ్ కోచ్ లేదా అసిస్టెంట్ కోచ్ గా పని చేయాలనుకుంటున్నానని అన్నాడు. మరోవైపు బౌలింగ్ కోచ్ గా జహీర్ ఖాన్ పని చేయాలనుకుంటున్నట్టు తెలుస్తోంది. జవగల్ శ్రీనాధ్ తో కలిసి వెంకటేష్ ప్రసాద్ బంతిని పంచుకునేవాడు. పాకిస్థాన్ మ్యాచ్ అంటే శివాలెత్తి బౌలింగ్ చేసే వెంకటేష్ ప్రసాద్ ఎన్నో మ్యాచ్ విన్నింగ్ బౌలింగ్ ప్రదర్శన చేశాడు. జహీర్ ఖాన్ గతంలో టీమిండియా ప్రధాన బౌలర్ గా సుదీర్ఘ కాలం రాణించాడు. 

  • Loading...

More Telugu News