: పిల్లలు లేరు అందుకే కిడ్నాప్ చేశాం... తిరుమల కిడ్నాప్ కథ సుఖాంతం!
ఈ నెల 14న తిరుమలలో కిడ్నాప్ కు గురైన బాలుడి ఆచూకీ లభ్యమైంది. శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చిన దంపతులు బాలుడ్ని ఎత్తుకుని వెళ్లినట్టు సీసీ టీవీ పుటేజ్ లో పోలీసులు గుర్తించారు. అప్పటి నుంచి బాలుడి కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. ఈ క్రమంలో తమిళనాడులోని నామకల్ లో బాలుడిని కిడ్నాప్ చేసిన దంపతులు, బాలుడితో పాటు లొంగిపోయారు. దీంతో బాలుడిని తీసుకుని పోలీసులు, తిరుపతి బయల్దేరారు. కాసేపట్లో బాలుడు తిరుపతి చేరుకోనున్నాడని, బాలుడు క్షేమంగా ఉన్నాడని తెలిపారు. తమకు పిల్లలు లేకపోవడంతోనే బాలుడ్ని కిడ్నాప్ చేశామని ఆ దంపతులు తెలిపారు. దీంతో వారిపై వివిధ సెక్షన్లపై కేసులు నమోదు చేసి, వారిని కూడా తిరుపతి తీసుకొస్తున్నారు.