: ముఖ్యమంత్రికి మతితప్పింది... నోబెల్ ఎవరికిస్తారో? ఎందుకిస్తారో కూడా తెలియదు: వైసీపీ ఎమ్మెల్యే అనిల్ ఎద్దేవా
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు మతితప్పిందని నెల్లూరు ఎమ్మెల్యే డాక్టర్ అనిల్ కుమార్ యాదవ్ విమర్శించారు. నగరంలో పర్యటించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర క్రీడాకారులు ఒలింపిక్స్ లో మెడల్ సంపాదిస్తే నోబెల్ బహుమతి ఇప్పిస్తాననడం హాస్యాస్పదమని అన్నారు. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తికి నోబెల్ బహుమతి ఎందుకిస్తారో తెలియకపోవడం ఆశ్చర్యకరమని ఆయన పేర్కొన్నారు. 2019లో అమరావతిలో ఒలింపిక్స్ నిర్వహిస్తామని చెబుతున్నారని, ఒలింపిక్స్ నిర్వహించేందుకు ఎలాంటి సౌకర్యాలు అవసరమో తెలియకుండా మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు. ముఖ్యమంత్రి అవగాహన లేని మాటలు చూస్తుంటే ఆయన మానసికస్థితి బాగాలేదని అర్ధమవుతోందని ఆయన పేర్కొన్నారు.