: ఆంటిగ్వా బీచ్ లో సందడి చేసిన కోహ్లీ సేన
భారతీయ కాలమానం ప్రకారం ఈ సాయంత్రం 6.30 గంటలకు ఇండియా, వెస్టిండీస్ ల మధ్య మూడో వన్డే ప్రారంభం కానుంది. ఆంటిగ్వాలోని సర్ వివియన్ రిచర్డ్స్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. ఈ సందర్భంగా నిన్న ఇరు జట్లు ప్రాక్టీస్ సెషన్ లో పాల్గొన్నాయి. అనంతరం కోహ్లీ, హార్దిక్ పాండ్యా, జడేజా, శిఖర్ ధావన్, కుల్దీప్ యాదవ్ తదితరులు కాసేపు స్థానిక బీచ్ లో సందడి చేశారు. బీచ్ వాలీబాల్ ఆడుతూ, సర్ఫింగ్, జెట్ స్కై చేస్తూ ఎంజాయ్ చేశారు. ఈ సందర్భంగా హార్దిక్ పాండ్యా మాట్లాడుతూ, బీచ్ లో చాలా ఆనందంగా గడిపామని, ఆంటిగ్వాలో గడిపిన క్షణాలు తీపి గుర్తులుగా మిగిలిపోయాయని చెప్పాడు.