: వీనస్ విలియమ్స్ డ్రగ్స తీసుకోలేదు...కానీ తప్పు ఆమెదే!: ఫ్లోరిడా పోలీసులు


ప్రముఖ టెన్నిస్ స్టార్ వీనస్ విలియమ్స్ కారును ఈ నెల 9న ఒక కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో చికిత్స పొందుతూ జెరోమ్ బార్సన్ (79) అనే వ్యక్తి మృతిచెందారు. ఈ నేపథ్యంలో ఈ కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులు వీనస్ విలియమ్స్ పాత్రపై స్పందించారు. ఫ్లోరిడాలోని పామ్ బీచ్ గార్డెన్ సిగ్నల్ వద్ద తన భర్త వేచి చూస్తుండగా, నిబంధనలు ఉల్లంఘించి, వీనస్ కారుతో ఢీ కొట్టిందని జెరోమ్ బార్సన్ భార్య లిండా బార్సన్ తెలిపారు. ఈ ఘటనలో డ్రైవ్ చేస్తున్న ఆమె కూడా గాయపడ్డారు.

ఇదే ఘటనలో గాయపడిన జెరోమ్ బార్సన్ 14 రోజులపాటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. దీంతో వీనస్ కు చిక్కులు తప్పేలా కనిపించడం లేదు. ఆమె కావాలని ఈ యాక్సిడెంట్ జరపకపోయినా, ఆమె కారణంగా యాక్సిడెంట్ జరిగిందని పోలీసులు చెబుతుండడంతో ఆమె కెరీర్ పై ప్రభావం చూపే అవకాశం ఉంటుందని తెలుస్తోంది. ఈ ఘటన జరిగినప్పుడు వీనస్ డ్రగ్స్, మద్యం తాగలేదని, డ్రైవ్ చేసేటప్పుడు కనీసం ఫోన్ కూడా మాట్లాడడం లేదని, అయినా ఆమె సైడు తప్పు వుందని దర్యాప్తు చేసిన పోలీసులు చెబుతున్నారు. 

  • Loading...

More Telugu News