: హైదరాబాదీ ఐపీఎల్ బౌలర్ సిరాజ్ కు శుభవార్త!


రంజీ ఆటగాడు హనుమ విహారి, ఐపీఎల్‌ లో సన్ రైజర్స్ హైదరాబాదు జట్టులో చోటుదక్కించుకుని సత్తాచాటిన హైదరాబాదీ పేసర్‌ మహమ్మద్‌ సిరాజ్‌ లకు బీసీసీఐ శుభవార్త వినిపించింది. సౌతాఫ్రికాలో పర్యటించనున్న భారత్‌-ఎ జట్టులో వీరు స్థానం సంపాదించుకున్నారు. ఈ ముక్కోణపు వన్డే సిరీస్ లో సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా ఏ జట్లతో భారత్ ఏ తలపడనుంది. అనంతరం సౌతాఫ్రికాతో నాలుగు అనధికారిక టెస్టులు ఆడనుంది.

వన్డే జట్టుకు మనీష్ పాండే నాయకత్వం వహించనుండగా, టెస్టు జట్టుకు కరుణ్ నాయర్ కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. హనుమ విహారి టెస్టు జట్టులో మాత్రమే స్థానం దక్కించుకోగా, సిరాజ్ మాత్రం వన్డేతోపాటు టెస్టు జట్టులో కూడా స్థానం సంపాదించుకున్నాడు. వారితో పాటు కృణాల్ పాండ్య, రిషబ్ పంత్, బేసిల్ ధంపీ, సిద్ధార్థ్ కౌల్ తొలిసారి భారత్-ఏ జట్టుకు ఆడనున్నారు. 

  • Loading...

More Telugu News