: మీడియానే బ్లాక్ మెయిల్ చేస్తారా?: కేటీఆర్ పై బీజేపీ ధ్వజం
డబ్బులు తీసుకుని తప్పుడు కథనాలు రాస్తున్నారంటూ మీడియాపై తెలంగాణ మంత్రి ఆరోపణలు చేయడం అత్యంత దురదృష్టకరమని బీజేపీ సీనియర్ నేత ఇంద్రసేనారెడ్డి అన్నారు. మీడియాను బ్లాక్ మెయిల్ చేస్తున్నారని మండిపడ్డారు. కేటీఆర్ వ్యవహరిస్తున్న తీరు అభ్యంతరకరమని, ఇది చెడు సందేశాలను పంపుతోందని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబం మీడియాను గుప్పిట్లో పెట్టుకునే ప్రయత్నం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తప్పేమీ జరగకపోతే... మియాపూర్ భూ కుంభకోణంపై ముఖ్యమంత్రి సీబీఐ విచారణకు ఎందుకు అంగీకరించడం లేదని ఇంద్రసేన ప్రశ్నించారు. రాష్ట్ర వ్యాప్తంగా లక్షల కోట్ల విలువైన భూములు అన్యాక్రాంతం అయ్యాయని... ఈ కుంభకోణాల్లో సీఎం పేషీ పాత్ర ఉందని ఆయన ఆరోపించారు. ఇందులో కాంగ్రెస్ నేతల హస్తం కూడా ఉందని... అందుకే వారు సీబీఐ విచారణ కోసం పట్టుబడటం లేదని అన్నారు.