: అయ్యన్నపాత్రుడి నియోజకవర్గంలో హీరో గంటా రవితేజ సినిమా పోస్టర్ల చించివేత... అభిమానుల ఆందోళన!
ఏపీలో సరికొత్త వివాదం రాజుకుంది. విశాఖపట్టణం జిల్లా నర్సీపట్నంలో 'జయదేవ్' సినిమా పోస్టర్లు చించేసి, కటౌట్లు ధ్వసం చేశారని ఆ సినిమా హీరో రవితేజ అభిమానులు ఆందోళన చేపట్టారు. విశాఖ జిల్లాకు చెందిన మంత్రులు చింతకాయల అయ్యన్నపాత్రుడు, గంటా శ్రీనివాసరావుకు మధ్య విభేదాలు ఉన్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో మంత్రి గంటా శ్రీనివాసరావు కుమారుడు రవితేజ హీరోగా 'జయదేవ్' సినిమా రూపొందింది. ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.
ఈ నేపథ్యంలో సొంత జిల్లాలో ఎక్కువ ధియేటర్లలో దీనిని విడుదల చేసేందుకు ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. ఈ క్రమంలో అయ్యన్నపాత్రుడి నియోజకవర్గంలో 'జయదేవ్' సినిమా పోస్టర్లును చించేసిన దుండగులు, కటౌట్లను కూడా ధ్వంసం చేశారు. దీంతో రవితేజ అభిమానులు మండిపడుతున్నారు. తమ హీరో పోస్టర్లు చించేసి, కటౌట్లు ధ్వంసం చేసిన వారిని పట్టుకుని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.