: అమర్ నాథ్ యాత్రకు మరోసారి అంతరాయం!
పవిత్ర అమర్ నాథ్ యాత్రకు అంతరాయం ఏర్పడింది. జమ్ముకశ్మీర్ లోని ఉధమ్ పూర్, బాల్టల్ లలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా యాత్రకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. బాల్టల్ నుంచి అమర్ నాథ్ వరకు దారి మొత్తం బురదతో నిండిపోయింది. దీంతో, అమర్ నాథ్ కు వెళుతున్న భక్తులను ఉధమ్ పూర్, బాల్టల్ ల వద్ద ఆపేస్తున్నారు. ఇదే సమయంలో ఉధమ్ పూర్ లో కొండ చరియలు విరిగిపడ్డాయి. దీంతో, జమ్ము-శ్రీనగర్ జాతీయ రహదారిని మూసి వేశారు. ఈ నేపథ్యంలో, వాహనదారులు ఇబ్బందులకు గురవుతున్నారు.