: అక్బరుద్దీన్ కేసు... పహిల్వాన్ నిర్దోషి అనడానికి అసలు కారణమిదే!
ఆరేళ్లనాడు ఎంఐఎం నేత అక్బరుద్దీన్ పై జరిగిన హత్యాయత్నం కేసులో ప్రధాన నిందితుడిగా పోలీసులు చేర్చిన పహిల్వాన్, జైలు నుంచి విడుదలయ్యాడు. ఈ కేసులో పహిల్వాన్ ను న్యాయస్థానం నిర్దోషిగా ప్రకటించిన సంగతి తెలిసిందే. అక్బరుద్దీన్ పై హత్యాయత్నం జరిగిన రోజు, అంటే, 2011 ఏప్రిల్ 30న ఆయన సంగారెడ్డిలో ఉన్నాడు. ఈ విషయంలో సాక్ష్యాలు కూడా ఉన్నాయి. పైగా ఘటనా స్థలిలో ఆయన ఉన్నట్టు, లేదా నిందితులతో ఆయన మాట్లాడినట్టు ప్రాసిక్యూషన్ నిరూపించలేక పోయింది.
న్యాయమూర్తి సైతం పహిల్వాన్ ఆ రోజు సంగారెడ్డిలో ఉన్నట్టు విశ్వసించారు. దీంతోనే ఆయన నిర్దోషిగా బయటకు వచ్చారు. ఇక ఇదే కేసులో మరో ఐదుగురు కూడా జైలు నుంచి విడుదలయ్యారు. మహ్మద్ బిన్ ఉమర్ (ఖైదీ నెంబర్ 4282), మహ్మద్ యునస్ బిన్ ఉమర్ (ఖైదీ నెంబర్ 4283), బహదూర్ ఆలీ ఖాన్ (ఖైదీ నెంబర్ 4284), ఇసబిన్ యునస్ యఫీ (ఖైదీ నెంబర్ 9136), సైఫ్ బిన్ ఉసేన్ యఫీ (ఖైదీ నెంబర్ 9137)లను కూడా విడుదల చేశారు.