: పెళ్లి కొడుకు కొంప ముంచిన నాగినీ డ్యాన్స్.. పీటల మీద పెళ్లిని రద్దు చేసుకున్న వధువు!


పెళ్లి కొడుకు వేసిన నాగినీ డ్యాన్స్ చూసిన పెళ్లి కుమార్తె వివాహాన్ని రద్దు చేసుకుంది. ఉత్తరప్రదేశ్‌లోని షహజాన్‌పూర్ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. పీకల దాకా తాగిన పెళ్లి కొడుకు అందరి మధ్య నాగినీ డ్యాన్స్ చేశాడు. మధ్యలో పాములా బుసలు కొడుతూ, మైమరచిపోతూ డ్యాన్స్ చేశాడు. అక్కడున్న వారు ఆ డ్యాన్స్‌ను ఎంజాయ్ చేసినా పెళ్లి కూతురుకు మాత్రం అతడి చేష్టలకు చిర్రెత్తు కొచ్చింది. పర్యవసానంగా మరికొన్ని క్షణాల్లో పెళ్లి తంతు మొదలు కాబోతుందనగా పెళ్లిని రద్దు చేసుకుంది. పెళ్లి కొడుకు తరపు బంధువులు నచ్చజెప్పినా వినని పెళ్లి కుమార్తె కుటుంబ సభ్యులతో కలిసి పెళ్లి మండపం నుంచి ఇంటికి వెళ్లిపోయింది.

షహజాన్‌పూర్‌కు చెందిన ప్రియాంక త్రిపాఠీ (23) కి అనుభవ్ మిశ్రాతో పెళ్లి కుదిరింది. పెళ్లికి ముందు జరగాల్సిన అన్ని కార్యక్రమాలు సవ్యంగా జరిగాయి. ఇక పెళ్లి జరగడమే తరువాయి. మంగళవారం రాత్రి పెళ్లి జరగాల్సి ఉంది. అతిథులు అందరూ హాజరయ్యారు. ఈ సందర్భంగా డీజే ద్వారా నాగిని సాంగ్ వేశారు. అంతే, రెచ్చిపోయిన పెళ్లికొడుకు అనుభవ్ పీకల దాకా తాగి డ్యాన్స్‌తో కిర్రెక్కించాడు. స్నేహితులు, బంధువులు అతడిపై కరెన్సీ నోట్లు విసురుతూ మరింత ప్రోత్సహించారు. అనుభవ్ మధ్యమధ్యలో పాములా బసలు కొట్టాడు. ఈ మొత్తం వ్యవహారాన్ని వీక్షించిన ప్రియాంక.. తాగుడు అలవాటున్న అనుభవ్ తనకు సరిజోడు కాదని భావించింది. అంతే, మరికొద్ది సేపట్లో పెళ్లి కార్యక్రమాలు మొదలవుతాయనగా వివాహాన్ని రద్దు చేసుకున్నట్టు ప్రకటించి పెళ్లి కొడుకును షాక్‌కు గురిచేసింది. వరుడు తరపు బంధువులు ఎంత బతిమాలినా, బెదిరించినా అంగీకరించకుండా కుటుంబ సభ్యులతో కలిసి ఇంటికి వెళ్లిపోయింది.

  • Loading...

More Telugu News