: నేనంటే నాన్నకు కోపం, అందుకే మా బాబాయ్ పుట్టిన రోజు వేడుకలకు కూడా రాలేదు: అఖిలేష్ యాదవ్


తనపై తన తండ్రి ములాయం సింగ్ యాదవ్ కోపంగా ఉన్నారని ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పార్టీ నాయకత్వం, పొత్తులు, సీట్ల కేటాయింపు విషయంలో అఖిలేష్ యాదవ్, ములాయం సింగ్ యాదవ్ మధ్య విభేదాలు చవిచూసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ములాయం కుటుంబం రెండు వర్గాలుగా విడిపోయింది. పార్టీ కూడా రెండు వర్గాలుగా విడిపోయింది. ఆ విభేదాలతో పార్టీ ఘోరపరాజయాన్ని చవిచూసింది.

అయితే, ఎన్నికలు ముగిసినా ములాయం కుటుంబంలో విభేదాలు మాత్రం సమసిపోలేదు. ఈ నేపథ్యంలో అఖిలేష్ యాదవ్ మాట్లాడుతూ, తన తండ్రికి తనపై కోపం ఇంకా పోలేదన్నారు. అందుకే తన బాబాయి రాంగోపాల్ యాదవ్ 71వ పుట్టినరోజు వేడుకలకు కూడా ఆయన రాలేదని అన్నారు. తన తండ్రికి తన బాబాయిపై కోపం లేదని, తనపైనే కోపమని ఆయన పేర్కొన్నారు. తన బాబాయి రాంగోపాల్‌ యాదవ్‌ సూచనలతోనే గతంలో తమ ప్రభుత్వం భారీ అభివృద్ధి ప్రాజెక్టులు చేపట్టగలిగిందని ఆయన తెలిపారు. 

  • Loading...

More Telugu News