: అవునా? మగాళ్లు ఆత్మహత్య చేసుకుంటారా? నేనెప్పుడూ విన్లేదే: కేంద్రమంత్రి మేనకా గాంధీ ఆశ్చర్యం


మగవాళ్లు ఆత్మహత్య చేసుకుంటారా? నేనెప్పుడూ వినలేదే! అంటూ కేంద్ర శిశుసంక్షేమ శాఖ మంత్రి మేనకా గాంధీ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తూ వ్యాఖ్యానించి అందర్నీ మరింత ఆశ్చర్యంలో ముంచెత్తారు. ఫేస్‌ బుక్‌ లైవ్‌ సెషన్‌ లో పురుషుల ఆత్మహత్యలను తగ్గించడానికి ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారంటూ ఒక నెటిజన్ ప్రశ్నించాడు. దానికి ఆమె సమాధానమిస్తూ... మగవాళ్లు ఆత్మహత్య చేసుకుంటున్నారా? ఏ మగాళ్లు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు? ఆత్మహత్య చేసుకోవడం కంటే పరిస్థితులను ఎందుకు చక్కదిద్దుకోవడం లేదు? అయినా తాను పురుషుల ఆత్మహత్యల గురించి ఎప్పుడూ వినలేదు, చదవలేదు అంటూ పేర్కొన్నారు. దీంతో లైవ్ లో వ్యక్తి ఆశ్చర్యపోయారు. కాగా, నేషనల్‌ క్రైం రికార్డుల బ్యూరో ప్రకారం 2015లో 1,33,623 మంది ఆత్మహత్యలకు పాల్పడగా, అందులో 91,528 మంది పురుషులున్నారు. మహిళలు 42,088 మంది బలవన్మరణానికి పాల్పడ్డారు.

  • Loading...

More Telugu News